|
From: Arjuna R. C. <arj...@go...> - 2011-05-26 11:31:53
|
ప్రవీణ్ 2011/5/24 ప్రవీణ్ <mai...@gm...>: > మిత్రులారా, > > దాదాపు ముఖ్యమైన లినక్స్ పంపకాలలో వాడే స్థానీకరణ అంతా గ్నోమ్ నుంచే వచ్చేదే > అని మనందరకూ తెలిసిందే, కాకపోతే గ్నోమ్ స్థానీకరణ చాలా వరకూ పూర్తయిన తరువాత > దాని పై సమీక్ష జరగనే లేదు చేసినవి చేసినట్టే ఉన్నాయి, ఆ తరువాత ఫ్యూయల్ > ప్రోజెక్టు ద్వారా స్థానీకరణలో వాడే పదాలను సూచించారు వీటిని గ్నోమ్ నందు > ఇదివరకు వాడిన పదాలకు బదులుగా ఇంకా పూర్తిస్థాయిలో వాడనేలేదు. అంతే కాకుండా > ఇప్పటివరకూ జరిగిన అనువాదాలలో అక్కడక్కడా కొన్ని దోషాలు ఉన్నాయి, వీటిని > సమీక్షించి సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధముగా చేయటం వలన లినక్సును > ప్రజలకు మరింత చేరువచేయవచ్చు మరియు పూర్తిస్థాయిలో వాడమని సూచించవచ్చు. గ్నోమ్ > 2.28 స్థిర విడుదల 93% పూర్తయినది ఆ తరువాత నవీకరించబడిన విడుదలలో పదజాలం > పెరిగింది అందువలన వాటిని జతచేసిన తరువాత అస్పస్ట పదజాలం(ఫజ్జీ) కూడా > పెరిగింది. ఇటీవలే గ్నోమ్ (నోమ్) 3.0 స్థిరమైన విడుదలయింది. దీని పై ఇంకా > శ్రధ్ద పెట్టలేదు అందువలన పూర్తయిన పని గణాంకాల ప్రకారం 77% ఉన్నది. ప్రస్తుతం > 3.2 అస్థిర విడుదల అభివృద్ధి చేయబడుడుతుంది. నోమ్ 3.2 విడుదలయ్యే సరికల్లా > స్థానీకరణ పూర్తి చెయ్యాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సమీక్ష చేస్తే > బాగుంటుందని ఆశిస్తూ ఈ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. వాడుకరి అంతరవర్తి > అనువాదాలు ఇలా ఉండగా పత్రీకరణ(డాక్యుమెంటేషన్) అనువాదాలు మాత్రం శూన్యం. దీనిపై > కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సివుంది. ఆసక్తి కలవారు ఈ మెయిలుకు స్పందించి > చురుకుగా పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఇటీవలే నేను మూడు గ్నోమ్ అంతర్భాగ > అనువర్తనాలను (ఎవిన్స్, చీజ్, ఫైల్-రోలర్) సమీక్ష చేసి, పూర్తి చేసి పై నిల్వలో > చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఫైల్ నిర్వాహకము అయిన నాటిలస్ సమీక్ష > చేస్తున్నాను. ఈ సమీక్షను ఒక నిర్దిష్ట గడువులో పూర్తిచేస్తే బాగుంటుందని > అభిప్రాయపడుతున్నాను. రెండు వారాల వ్యవధిలో పూర్తిచేస్తే బాగుంటుందనేది నా > అభిప్రాయం. మీ అభిప్రాయాలను కూడా సంకోచించకుండా జోడించండి. > మంచి ప్రయత్నం. మీ ప్రణాళిక, సూచనలు ఏదైనా వెబ్సైట్ ద్వారా పంచుకుంటే మంచిది. https://sites.google.com/site/linuxteluguusers/ వాడొచ్చు లేక వేరేదైనా. ధన్యవాదాలు అర్జున |