|
From: Gōpāl/గోపాల్ <gop...@gm...> - 2012-09-05 23:16:56
|
నమస్తే, ఈ మెయిలు.. నా పూర్వపు మెయిలుకి మీరంతా పంపిన సమాధానాలూ, ఒక సంవత్సరంగా నా బుర్రలోనే తప్ప ఆచరణకి నోచుకో(లే)ని కొన్ని ఆలోచనలూ కూడుకున్నది. మనందరం ఖచ్చితంగా కోరుకునే ఒక్క విషయం: అంతా కష్టపడి మనం చేస్తున్న కృషికి తగిన ప్రయోజనం ఉండటం. ఐఐఐటి-హైదరాబాద్ పుణ్యమా అని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో ఉన్న దాదాపు అన్ని పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో నాకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు చాలా మందే ఉన్నారు. ఆ ఆఫీసుల్లో పని చేసే వాళ్ళలో > 95% మందికి వాళ్ళ వాళ్ళ భాషల్లో టైప్ చేయడం, వాళ్ళ భాషల్లో బ్లాగులుండటం గట్రా తెలియవు (ఇది నేను రూడీ చేసుకుని చెప్తున్న విషయం). నా ఆలోచన ఇది: ఈ కార్పొరేట్ సంస్థలలో పని చేస్తున్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ భాషల్లో టైప్ చేయడం నేర్పించడం (తెలుగొక్కటే కాదు), బ్లాగులు/వికీపిడియా పరిచయం చేయడం. HR department, Social welfare (లాంటి) department ని సంప్రదించి ఇలాంటి workshopలు గాని, టాక్లు గాని ఇవ్వడం కుదురుతుందో లేదో కనుక్కోవడానికి Pega, CSC లలో సంప్రదించమన్నాను నా స్నేహితులని. కుదురుతుందని abstract/వివరాలు పంపమని చెప్పారు. అయితే ఇదొక *విప్లవంలా జరగాలి*. మాతృభాషలో టైప్ చేయడం అంటే *prestige* లా భావించాలి, *స్టైల్ factor* ఉండాలి. తగిన కంటెంట్ తయారు చేస్తున్నాను, సమయం పట్టొచ్చు. వర్కుషాపులకి, టాకులకీ మట్టుకు ఖచ్చితంగా ఒక జట్టు కావాలి: presentations బల్ల గుద్దినట్టుండేలా ఇచ్చే వాళ్ళు మరీ మరీ కావాలి. నేను నవంబరు నుంచి జనవరి మొదటి వారం దాకా ఇండియాలో (చెన్నై, మధ్యమధ్యలో హైదరాబాద్) ఉంటాను. బహుశా ఆ సమయానికి ఈ కంటెంట్ సిద్దంగానూ ఉంటుంది, అప్పటికి మరికొన్ని సంస్థలనుంచి అనుమతి కూడా తీస్కుని ఉంటాను. అప్పుడు కలిసి మాట్లాడి పనులు మొదలుపెడదాం. మీరు సహాయపడగలరా? ఇంకెవరైనా ఆసక్తి చూపేవాళ్ళుంటే వాళ్ళకి కూడా చెప్పండీ విషయం! -- Regards, -- Kōḍūri Gōpāla Kr̥ṣṇa, Music Technology Group, UPF - Barcelona, Spain. Portfolio - http://tidbits.co.in తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com |